పాత పెన్షను విధానాన్నిపునరుద్దరించాలి

రెండవ పేరిజన్ కమీషను కమిటిని నియమించాలి
ఐ.ఆర్. ప్రకటించి పెండింగులోవున్న డి. ఆర్ లువిడుదల చేయాలి
ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్ జూన్ 27 );రెండవ పేరిజన్ కమీషను కమిటిని నియమించి 1-7-2023 నుండి అమలు పరుచుట అంతవరకు ఐ.ఆర్. ప్రకటించి పెండింగులోవున్న డి. ఆర్ లువిడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లోని బడీచౌడి రాష్ట్ర సంఘం కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సంఘం రాష్ట్ర అద్యక్షులు దామోదర్ రెడ్డి, సెక్రటరి జనరల్ చంద్ర శేకర్ లు మాట్లాడుతూ గతం లో ఏప్రిల్ 10 వ తేదిన కూడ అవే సమస్యలపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేటుల వద్ద వేలాది మంది పెన్షనర్లతో నిరసరనదీక్ష నిర్వహించగా స్పందించిన ప్రభుత్వము జనవరి 2022 నుండి 1 విడత డి.ఆర్. మరియు మరణించిన పెన్షనర్లకు దహనసంస్కారాల నిమిత్తము కనిష్ఠ సహాయము రూ.20,000/- నుండి రూ.30,000/ లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసారు. హైదరాబాదు టిఎస్జిఆర్ఇఏ రాష్ట్రములోని 85% పెన్షనర్ల ల సభ్యత్వము కలిగివున్నందున రాష్ట్ర సంఘ భవనమునకు స్థలము కేటాయించి, భవన నిర్మాణమునకు నిధులు సమకూర్చి టిఎస్జిఆర్ఇఏ సంఘానికి ప్రభుత్వ గుర్తింపు నివ్వాలని కోరారు. పెన్షనర్లకు తీవ్రంగానే వేధిస్తున్న అనారోగ్య సమస్యల నివారణకు మూల్యపెన్షను నుండి 1% మినహాయించి పూర్తి స్థాయిలో సౌకర్యము ఇహెచ్ఎస్ కలుగజేయాలని,పెన్షనర్లు కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సం.ల నుండి 12 సం.లకు తగ్గించాలని కోరారు. డెత్ రిలీఫ్ ఫండు, మెడికల్ రిఇంబర్సు మెంటు బిల్లులు, 2018 తరువాత పదవీ విరమణ పొందిన పెన్షనర్ల వివిధ రకాల పెన్షనరి సదుపాయముల బిల్లులు వెంట వెంటనే చెల్లించాలని,5. రూ.లు 398/ లకే వేతనంపై నియమించబడిన స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి తదను సారంగా పెన్షను చెల్లించాలని కోరారు.నూతన పెన్షను విధానాన్ని రద్దు పరచి పాత పెన్షను విధానాన్నిపునరుద్దరించాలని కోరారు. ఇతర సమస్యలపై పెన్షనర్ల సంఘ ప్రతినిధులతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రతి మూడు నెల ల కొకసారి సమావేశము నిర్వహించి చర్చించి పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోల సంఘం, టిఎస్జిఆర్ఇఏ ఏ జెయెసిలోను సభ్యత్వము కలిగిలేదు. జెయెసి ల పేరిట ఇచ్చే ప్రకటనలతో మా సంఘానికి సంబంధములేదని పేర్కొన్నారు. నేటి నుండి 30 రోజుల వరకు సమస్యలు సుహ్రుద్భావవాతావరణంలో పరిష్క రింబడ నట్లైతే తదుపరి వేలాది మంది పెన్షనర్ల తో రాష్ట్ర రాజధానిలో ఆందోళన కార్యక్రమము నిర్వహిస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking