బుల్కాపూర్ నాల, పందెంవాగు స్థలాలను పరిరక్షించే నాధుడే కరువాయే !

ప్రజాబలం స్పెషల్ బ్యూరో ప్రతినిధి 2 ఏప్రిల్ 2025
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఇంజనీర్ హుస్సేన్ షా వలి ద్వారా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోనే ప్రఖ్యాతి గాంచిన బుల్కాపూర్ గ్రామం నుండి గురుత్వాకర్షణ శక్తి మేర రూపొందించిన బుల్కాపూర్ నాల ఖాజాగూడ దాటిన తరువాత మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ల్యాంకో హిల్స్ గుండా మఱ్ఱిచెట్టు మీదుగా, మార్గ మధ్యంలో ఎల్లమ్మ చెరువు మత్తడి నీటిని, ముష్కిం చెరువు మత్తడి నీటిని కూడ ఇందులో కలుపుకొని పంచవటి కాలనీ దాటుకొని శైక్పెట్ నాల ద్వారా గతంలో హుస్సేన్ సాగర్ లో కలసేది, అప్పటి అధికారుల మద్దతుతో కొద్ది కాలం క్రితం అట్టి మంచి నీటి నాలా ఒక వైపు బఫర్ జోన్ కొంత మేర స్థలాన్ని రహదారిగా మార్చినను అట్టి రోడ్డు కూడా సగం వరకు అక్రమ వాహనాల పార్కింగ్ లకు వాడు కుంటున్నారనీ స్థానికులు వాపోయారు మరియు కాలక్రమేణ మణికొండ పరిధి లోని మఱ్ఱిచెట్టు పరిసర ప్రాంతాల లోనీ మొత్తంగా 100 శాతం బుల్కాపూర్ నాల స్తలం కాస్తా పూర్తిగా ఆక్రమణలకు గురి అయిందని మరియు పంచవటి కాలనీ దాటుకొని శైక్పెట్ నాల వైపు వెళ్లకుండా కట్టడి చేయడం వలన, మిగిలిన కాస్తో కూస్తో మంచి నీటి బుల్కాపూర్ నాల కాస్త డ్రైనేజీ లను అనుసంధానం చేయడం వలన డ్రైనేజీ కాలువగా మారి పంచవటి కాలనీ వద్ద పందెం వాగు వైపుకు మళ్లించడం దరిమిలా మంచి నీరు పారుదలగా ఉన్న పందెం వాగు కాస్త డ్రైనేజీ కాలువగా మారడం జరిగినది. వర్షాకాలంలో అట్టి వాగు మరియు నాల రెండూ కలసి పందెన్వాగుగా కలుషితమై పొంగి పొర్లుతూ దుర్గంధంతొ సహా పంచవటి కాలనీ దాటుకొని సమ సమాజం లోనే పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మహా నగరంలోనే భారీ వ్యయంతో కట్టుకున్న ది ట్రయల్స్ డూప్లెక్స్ విల్లాలలో జీవిస్తున్న వారి గ్రౌండ్ ఫ్లోర్ ఇండ్ల లోకి మూడు నాలుగు అడుగుల వరకు దుర్గంధపు నీరు రావడం, విపరీత పరిస్థితిలో అక్కడి లక్ష్మీ పుత్రులు కాస్తా పైన ఫ్లోర్ లలో జీవనం కొనసాగించడం మినహా ఏమి చేయలేని పరిస్థితిలో, సమయం గడపడం జగమెరిగిన సత్యం అని ! ఇందు మూలంగా వర్షాకాలంలో ఈ విల్లాల పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు మరియు ముంపు ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా అట్టి కంపు వాగునీటి ముంపుకు గురవుతు నానా తిప్పలు పడుతున్నారనీ తమ వ్యధను స్థానికులు ఏకరువు పెట్టారు, అంతే కాకుండా పందెన్వాగు ముందుకు సాగి చిన్న చెరువులో కలసి దుర్గంధపు వాసన వెదజల్లుతూ, గుర్రపు డెక్కకు నిలయమై దోమలకు అనువైన ప్రాంతంగా విరాజిల్లుతూ, వాటి బెడదతో అలకాపుర్ పరిసర ప్రాంత వాసుల పిల్లలు వయోజన వృద్దులు అనారోగ్యం పాలవుతున్నారని తమ వ్యధను వెళ్లబోసుకున్నారు. అట్టి పందేన్వాగు మూసి నదిలో కలిసే ముందు ఇబ్రహీంబాగ్ పెద్దచెరువును కూడా అపరిశుభ్రత పరచడం వలన నెక్నంపూర్ పరిసర ప్రాంతలలో కాలుష్యము లేని స్థలాలుగా ఎంచుకొన్న ఫ్లోటిలా, టేక్వుడ్, స్పెక్ట్రమ్ విల్లాస్ నివాసులు మరియు పయనీర్, ఈ.వీ.వీ, వెంకటేశ్వర, వై.ఎస్.ఆర్ కాలనీల ప్రజలు ప్రతి రోజూ దోమల బెడద తో పాటు వాయు కాలుశ్యంతో కూడిన దుర్గంధ వాసనతో నరక యాతన పడుతుండగా ఉడతా భక్తిగా ది సిటిజన్స్ కౌన్సిల్ కార్యదర్శి బొమ్ము ఉపేందర్నాథ్ రెడ్డి వారి శక్తి మేర స్వంత ఖర్చుతో దోమల నివారణకు ఫాగ్గింగ్ చేయిస్తున్నారని, అందుకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని స్తానిక ప్రజలు తెలిపినారు. తదుపరీ బుల్కాపూర్ నాల మరియు పందేన్వాగులకు చెందిన బఫర్ జోన్ ఫెన్సింగ్ లను ఇరువైపులా ఎటు వీలైతే అటు సైతం తప్పించి అట్టి స్థలంలను ఆక్రమించుకొని కబ్జా చేసి అంతస్థుల మీద అంతస్తుల ఇండ్లు కట్టుకొని దర్జాగా ఉంటుండగా, ప్రతీ విషయం కూల కశంగా తెలుసుకొని కూడా స్పందించకుండా, పరిగణలోకి తీసుకొకుండా సంబంధిత అధికారులు మాత్రం తమాషా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు గమ్మున ఉండడం చూసి మర్మ మెరిగిన మణికొండ ప్రజలు విడ్డూర పడుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking