సర్దార్ సర్వాయి పాపన్నకు జిల్లా కలెక్టర్ ఘన నివాళి

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాపన్న వర్ధంతి

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ -2 (ప్రజాబలం ప్రతినిధి)సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించగా, కలెక్టర్ హాజరై పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, ఎల్ డీ ఎం మల్లికార్జున్ రావు బీసీ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking