మణికొండలో యదేచ్చగా కట్టడాలు.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 2 ఏప్రిల్ 2025.
గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట బీ.ఆర్.ఎస్ పార్టీ మణికొండ రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు మణికొండ పురపాలక సంఘ పరిధిలోని తులీప్ గార్డెన్స్, ఫ్రెండ్స్ కాలనీలోని ఫస్ట్ లైన్ మరియు జైహింద్ నగర్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు వెలుగు పరచిన ప్రధాన సమస్యలు, స్థానికంగా ఉన్న ఫ్రెండ్స్ కాలనీ పార్క్ లో పిల్లలు ఆడుకొనే మరియు పెద్దలు జిమ్ చేసే పరికరాలు దెబ్బతిన్నవని వాటి సంరక్షణ బాధ్యత ఉన్న మున్సిపల్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని వాపోయారు. ప్రజా నాయకులు వారి సంబంధితుల అండదండలతో మునిసిపల్ చట్టాన్ని తుంగలో తొక్కి యదేచ్చగా ఇష్టం ఉన్నన్ని అంతస్తులు కడుతున్నను అడిగే నాధుడు కరువైనాడని స్తానికులు ఆరోపిస్తున్నారు. లాలమ్మ గార్డెన్స్ నుండి, ఫ్రెండ్స్ కాలనీ వైపు నుండి తులిప్ గార్డెన్ గుండా వెళ్లే రోడ్దు మార్గంలో ద్విచక్ర వాహన దారులు అతివేగముగా వెళుతున్న కారణంగా యాక్సిడెంట్స్ లు జరుగు తున్నాయని తెలియజేస్తూ పరిష్కారంగా మున్సిపాలిటీ వారు స్పీడ్ బ్రేకర్లు వేయించాలని కోరారు. కొన్నిచోట బోర్లు ఎండిపోయిన కారణంగా కేవలం హైదరాబాద్ వాటర్ వర్క్స్ వారి నీటిపై ఆధార పడిన కారణంగా వారు సరిపడ నీళ్లు వదలక పోవడం వలన ఎక్కువగా ట్యాంకర్ల మీద ఆధార పడడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే కొత్త డ్రైనేజీ లైన్ వేసినప్పటికీ తరచు డ్రైనేజీ సమస్య వస్తున్నదనీ వాపోయారు. ఫ్రెండ్స్ కాలనీ రోడ్డు నుంచి తులిప్ గార్డెన్ రోడ్డు ప్రవేశం ప్రాంతంలో గుంతల మయం కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఫ్రెండ్స్ కాలనీ ఫస్ట్ రోడ్డు డ్రైనేజీ పైప్లైన్ కారణంగా రోడ్డు పునర్నిర్మాణం జరగలేదు. పై పెచ్చు తరచూ ఈ రోడ్ లో షేక్పేట్ నుండి డ్రైనేజీ సమస్య తలెత్తుతున్నది. ఈ రోడ్ లో స్థానికులకు మంచినీటి ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత సమయానికి రానందువలన దీంతో ఇక్కడ స్థానికులు ప్రైవేట్ ట్యాంకర్ పై ఆధార పడుతున్నారు. పైప్లైన్ రోడ్డు నుంచి జైహింద్ నగర్ వెళ్లే ప్రవేశం వద్ద రోడ్డు గుంతల మయంగా ఉందని తెలిపినారు. కావున పైన తెలిపిన అన్ని సమస్యలను మణికొండ మున్సిపాలిటీ వారు మరియు హైదరాబాద్ వాటర్ వర్డ్స్ వారు పరిగణలోకి తీసుకొని స్పందించి స్థానికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నదనీ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, బుద్ధోలు బాబు, మాల్యాద్రి నాయుడు, శ్రీనివాస్ చారి, సంఘం శ్రీకాంత్, గోరుకంటి విఠల్, కిరణ్ యాలాల, భాను చందర్, సుమనళిని, బొడ్డు శ్రీధర్ తది తరులు తెలియ పరచడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking