రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 21 మార్చి 2025
గుడ్ మార్నింగ్ మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ మార్నింగ్ వాక్ శుక్రవారం రోజున పుప్పాలగుడా శ్రీ లక్ష్మినరసింహ స్వామి నగర్ వీదులలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా: జనావాసాల మధ్యలో ఈ.ఐ.పీ.ఎల్ రెడీ మిక్స్ ప్లాంట్ నడుపుతున్న కారణంగా దుమ్ము, ధూళి, శబ్ద, వాయు కాలుశ్యాలతో చిన్నా పెద్దలు అనారోగ్య పాలవడం, నిద్ర లేమితో బాధపడుతూ ఇట్టి సమస్యల గురించి పలుమార్లు స్థానిక నాయకులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ స్పందన లేదని వాపోయారు. రెడీ మిక్స్ ప్లాంట్ లేబర్ క్యాంప్ గుడిసెలు వేసిన కారణంగా పుప్పాలగూడ గ్రామ స్మశాన వాటికకు పాత కాలం నుండి ఉన్న బండ్ల బాట కబ్జాకు గురి కావడం, స్వచ్ఛత పాటించక పోవడం, రాత్రి పూట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోయారు. తదుపరి షేక్పేట్ నుంచి ఓ.ఆర్.ఆర్ సర్వీస్ రోడ్డు వరకు చేపట్ట వలసిన రేడియేల్ రోడ్ (నెంబర్ 5) అసంపూర్తిగా ఉన్న కారణంగా మణికొండ ప్రజానీకం తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారని కావున హెచ్.ఎం.డి.ఏ అధికారులు ఈ రోడ్డు పనిని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారరు మంచినీరేమో నిర్ణీత సమయంలో రాకుండా, వచ్చినా అరగంట నుంచి 45 నిమిషాలు రావడం వలన సరిపోవడం లేదని తెలియ పరచారు. ఇక్కడ దాదాపు 70 నుంచి 80 వీధి కుక్కల కారణంగా పిల్లలు పెద్దళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మున్సిపాలిటీ వారు సత్వరమే స్పందించి వీధి శునకాలకు షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయ వలసిందిగా కోరడమైనది. రహదారులకు మున్సిపాలిటీ ప్యాచ్ వర్క్ చేయించని కారణంగా స్థానికులే ప్యాచ్ వర్క్లు చేసినట్టు తెలిపారు. ఇక రోడ్డు లెవెల్ పాటించని కారణంగా వర్షాకాలంలో కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు నీళ్లు నిలుస్తున్నవని చెప్పినారు. మున్సిపాలిటీ వారు రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమం నెలకి మూడు లేక నాలుగు సార్లు మాత్రమే చేస్తున్నారని స్థానికులు తెలియజేశారు. కావున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, హైదరాబాద్ వాటర్ వర్క్స్, హెచ్.ఎం.డి.ఏ మరియు మణికొండ మున్సిపాలిటీ అధికారులందరూ పై సమస్యలకు పరిష్కార దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేందర్నాధ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, దిలీప్, కిరణ్ యాలాల, భాను చందర్, సుమనళిని, సుమన్, బొడ్డు శ్రీధర్, మహేందర్, తిరుపతి తది తరులు తెలియ పరచారు.
Prev Post
Next Post