దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి

హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 20

జమ్మికుంట మున్సిపల్ మూడో వార్డ్ కౌన్సిలర్ రవీందర్ పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి ని కోరారు. రవీందర్ దాడిలో గాయపడిన బాధితుడుని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్నారని అక్కడికి వెళ్లి అడిగిన వారిని దుర్భాషలాడుతూ రాడ్ తో దాడికి పాల్పడ్డారని అన్నారు. ధర్మారం శివారులోని 422 సర్వేనెంబర్ అది ప్రభుత్వ భూమి అని గతంలో ఆపిన దానిని తిరిగి కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఆపడానికి వెళ్ళిన వారిపై దాడికి పాల్పడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రవీందర్ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలను తీర్చమని తప్ప రౌడీయిజం కోసం కాదన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking