ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 28:
మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే నారాయణరెడ్డి కుమారుడు తంగిళ్ళ సాత్విక్ పదవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం సమయంలో ట్యూషన్ కి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన సాత్విక్ తిరిగి రాకపోవడంతో. తల్లిదండ్రులు భయాందోళనలకు గురై సోమవారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తక్షణమే పోలీసు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి మరియు బ్లూ కోర్స్ సిబ్బందితో వెతికాసాగారు. పోలీస్ అధికారులు బాబు వివరాలతో సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో పంపించగా. మంచిర్యాల పట్టణంలోని ఆటో యూనియన్ సోషల్ మీడియాలోని వచ్చిన కథనాన్ని చూసి బాబుని గుర్తుపట్టి సోమవారం రోజు సుమారు రాత్రి 2 గంటలకు పోలీస్ అధికారులకు అప్పగించడంతో వారి తల్లిదండ్రులకు బాబుని క్షేమంగా అప్పగించినట్లు ఎస్.ఐ శివనీతి రాజశేఖర్ తెలిపారు.