ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 28 :
మందమర్రి ఏరియా రక్షణపై ఉన్నతాధికారులతో మంగళవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్లో మందమర్రి ఏరియా జి.ఎం జి. దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ అధికారి రఘు కుమార్, ఏరియా ఏ.ఎస్.ఓ. రవీందర్ ఆధ్వర్యంలో అన్ని గనులు డిపార్టు మెంట్ల సేఫ్టీ అధికారులు మరియు ఇతర ఉన్నతాధికారులతో సేఫ్టీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎల్లప్పుడు రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతను సాధించాలని అధికారులకు సూచించారు. పని స్థలాలను నిషితంగా పరిశీలించిన అనంతరమే విధులు నిర్వహించడం మంచిదని అన్నారు. సూపర్వైజర్లు పక్కాగా పని స్థలాలను పరిశీలించాలని అన్నారు. అంతేకాకుండా గత సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ మీద, ఎస్.ఏం.పి మీద ప్రిపరేషన్ అండ్ ప్లాన్, ఐ.ఎస్.ఓ ప్రిపరేషన్, పి.ఎం.ఈ టార్గెట్ గత సంవత్సరంలో పెండింగ్ లో ఉన్న వాటి గురించి చర్చించారు. డైరీ రెగ్యులర్ గా వ్రాయడం గూర్చి ఇంకా రక్షణ విషయాలను గురించి క్షుణ్ణంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్. ఒ.టూ.జి.ఎం విజయ ప్రసాద్, మందమర్రి ఏరియా అన్ని గనుల సేఫ్టీ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.