రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి

జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 28:
జిల్లా కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా రోడ్లు మరియు భవనాల అధికారి, జిల్లా రవాణా అధికారి, ట్రాఫిక్ అదనపు డిసిపి, ఎసిపి సైబరాబాద్, కూకట్‌పల్లి, మేడ్చల్, మునిసిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాలో రహదార్లపై జరుగుతున్న ప్రమాదాలు మరియు వాటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగినది. జిల్లాలో రహదార్లపై ప్రమాదాలు తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసు వారితో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్లను మరియూ ఇతర వాటాదారులను చైర్మన్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచడం కొరకు జనవరి నెలలో రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking