పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించాలి
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 28:
డిజిటల్ క్లాసులలో వచ్చే ఇంగ్లీషు విద్యార్థులకు సులువుగా అర్దమయ్యేలా ఉండేలా చూసుకోవాలని హెడ్ మాస్టర్ కు సూచిస్తూ, పదవ తరగతి విద్యార్థులు బాగా చదువుకొని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్దులకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం భోదించారు.
మంగళవారం మేడ్చెల్ మండలంలోని శ్రీరంగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టరు గౌతం తనిఖీ చేసారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ డిజిటల్ తరగతులను పరిశీలించి అందులోని ఇంగ్లీషు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ కు సూచించారు. అనంతరం పిల్లలతో ముచ్చటిస్తూ సిలబస్ పూర్తయిందా అని, ఎలా చదువుతున్నారని విద్యార్థులను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ లోని ఒక గణిత సమస్యను విద్యార్థులకిచ్చి చేయమని తెలుపగా, విద్యార్థులు సమస్యను చేసి కలెక్టరుకు చూపించారు. కలెక్టరు విద్యార్థులను అభినందించి బాగా చదువుకోవాలని సూచించారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, వంటగది, డైనింగ్ హాల్ ను తిరిగి పరిశీలించారు. అవసరమైన సలహాలను సూచనలను హెడ్ మాస్టర్ కు కలెక్టరు సూచించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ఆదేశించారు. ల్యాబ్ లోని పరికరాలను పరిశీలించి, వినియోగంలో లేని వాటిని రిప్లేస్ చేయించాలని సూచించారు. లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులలో కొంత మంది చదువుతున్న ఇంగ్లీషు పాఠాన్ని తెలుగులో చెప్పమనగా, విద్యార్థులు చదివి అర్దవంతంగా వివరించగా కలెక్టరు సంతోషించి వారికి పెన్నులను బహుకరించారు. అనంతరం ప్రక్కనే ఉన్న అంగన్వాడీని సందర్శించి ఎంతమంది చిన్నారులున్నారని, వారి హాజరు రిజిష్టరును కలెక్టరు పరిశీలించారు. ఏవిధంగా చిన్నారులకు చదివిస్తున్నారని, వారికి అందించే భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే అక్కడే ఉన్న వెటర్నరీ ఆసుపత్రిని కలెక్టరు వెటర్నరి డాక్టరును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అక్కడి నుండి నూతన్ కల్ లోని పల్లె దవఖానాను కలెక్టరు తనిఖీ చేసారు. పల్లె దవఖానాను పేద ప్రజలకు ఉపయోగపడేలా ఔట్ పేషంట్స్ శాతాన్ని పెంచాలని కలెక్టరు గౌతం ఆదేశించారు.పల్లె దవఖానాను పరీలించి, పల్లె దవఖానాను పేద ప్రజలకు ఉపయోగపడేలా ప్రచారం చేసి, ఔట్ పేషంట్ శాతాన్ని పెంచాలని డాక్టరుకు సూచించారు. పల్లె దవఖానాను పరిశీలించి ప్రతిరోజు ఔట్ పేషంట్స్ ఎంత మంది వస్తారు, గ్రామంలో జనాభా ఎంత అని డాక్టరు, ఎఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు సుమారుగా 35 మంది ఔట్ పేషంట్స్ వస్తారని డాక్టర్ తెలుపగా, ఓపిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దవఖానాలోని రిజిష్టర్లను కలెక్టరు పరిశీలించి తగు సూచనలు చేసారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ విజయలక్ష్మి, డిఎం అండ్ హెచ్ఓ రఘునాథ స్వామి, జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత, ఎంఆర్ఓ శైలజ, ఎంపిడిఓ వసంత లక్ష్మి, జెడ్ పి సిఈఓ కాంతమ్మ,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.