ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణలో టెంపుల్‌ టూరిజం, హెల్త్‌ టూరిజం, ఎకో టూరిజం రంగాలు అభివృద్ధి చెందడానికి రాబోయే కొద్ది రోజుల్లో ఒక విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చెప్పారు.
ఐటీ, ఫార్మా, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలతో పాటు టూరిజం రంగాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని అభివృద్ధి చేస్తే ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా రాష్ట్రానికి ఒక గుర్తింపు, గౌరవాన్ని తెస్తాయని అన్నారు.
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు , కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి , ఎంపీలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ , సీఎం రమేశ్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి , ఎమ్మెల్యేలు కాలె యాదయ్య , మల్‌రెడ్డి రంగారెడ్డి తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులను, దుశ్చర్ల సత్యనారాయణ ను సత్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో విద్యార్థినీ విద్యార్థులందరూ తమ తల్లి పేరుతో ఒక్కొక్క మొక్కను నాటి సంరంక్షించేలా కేంద్రం తీసుకున్న జుస ూవస వీaa ఖవ చీaaఎ కార్యక్రమం తరహాలో ప్రభుత్వం త్వరలోనే ఒక విధానం తీసుకొస్తుంది.
తెలంగాణలో సహజ వనరులు ఉన్నా ప్రభుత్వాలు ఇప్పటివరకు హెల్త్‌, ఎకో, టెంపుల్‌ టూరిజం రంగాలపై దృష్టి సారించలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అద్భుతమైన ఆలయాలు ఉన్నప్పటికీ టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చెందలేదు.
దేవాలయాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకు లేదా ఇతర రాష్ట్రాలకు, ప్రకృతి సంపద, సహజ వనరులను చూడాలంటే మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలకు, హెల్త్‌ టూరిజంలో మరెక్కడికో వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి.
కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కావొచ్చు, నల్లమల టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కావొచ్చు, కొల్లాపూర్‌ అటవీ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం గానీ, అక్కడ మందిరాలు.. ప్రకృతి సహజ వనరులకు కొదవ లేదు. వాటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను ఇవ్వలేదు.
వికారాబాద్‌ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతోనే దావోస్‌లో ఒక సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసింది.
ఎక్స్‌పీరియం పార్క్‌ను నిర్మించిన రామ్‌దేవ్‌ రావు గారిని అభినందిస్తూ, ఇది ఏడాది, ఏడాదిన్నర తర్వాత ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి సాధించడానికి ప్రాతిపదికగా మారుతుంది.’’

Leave A Reply

Your email address will not be published.

Breaking