షర్మిల ను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి తలపెట్టిన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజక వర్గం పర్యటన రద్దయింది. శుక్రవారం నాడు జగదేవ్‌ పూర్‌ మండలం, తీగుల్‌ గ్రామంలో పర్యటించాల్సి వుంది. అయితే , ఉదయం 9 గంటలకు లోటస్‌ పాండ్‌ నివాసం నుంచి బయలు దేరటానికి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దళిత బందు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్‌ గ్రామంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో లోటస్‌ పాండ్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులతో వైఎస్‌ షర్మిల వాగ్వాదానికి దిగారు. తన పర్యటనకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా పోలీసులకు హారతి పట్టారు. సిఎం కేసీఆర్‌ తీరుకు నిరసన గా సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking