న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి.

హుజురాబాద్ బార్ అసోసియేషన్.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 8

జనగామ పట్టణంలో న్యాయవాద దంపంపతులపైదాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు, శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన కార్యదర్శి మట్టెల తిరుపతి,సీనియర్ న్యాయవాదులు వీరసేనారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ముక్కెర రాజు, నల్ల భూమిరెడ్డి,బండి కళాధర్,పులుగు లింగారెడ్డి, బండి రమేష్, నక్క సత్యనారాయణ, ఆకులశ్రీనివాస్, ముషం మౌనిక, విక్రం. రవితేజ, ప్రవీన్, కుమారస్వామి, మాధవి, సరిత, దివ్య, లింగమూర్తి, దేవయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking