– మంత్రి పొన్నంకు వినతి,
– బుర్ర కుమార్ గౌడ్….
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 8
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కొత్తకొండ దేవస్థానం వీరభద్ర స్వామి దేవాలయంలో కలిసి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పదవి కల్పించాలని జమ్మికుంట పట్టణ మాజీ ఉపాధ్యక్షుడు బుర్ర కుమార్ గౌడ్ కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీలోనే కొనసాగుతూ ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చిన పార్టీని వీడకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, ఉప ఎన్నిక సమయంలో ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసిన పార్టీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేశానని, కార్యకర్తలను తయారు చేశానని పార్టీ కష్టకాలంలో బూత్ లెవెల్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు అందర్నీ సమన్వయం చేసి పార్టీ సంక్షేమం ధ్యేయంగా పని చేశాను అని అన్నారు. రైతు సమస్యల పై బహిరంగంగా నిలదీసినందుకు అప్పటి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హేళన చేశారని, అయినప్పటికీ కూడా రైతుల, హుజరాబాద్ నియోజకవర్గం ప్రజల సమస్యల పట్ల అనేక సందర్భాలలో అప్పటి అధికార పార్టీ టిఆర్ఎస్ తో కొట్లాడినట్లు గుర్తు చేశారు. తన విజ్ఞప్తిపై రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.