ప్రమాదవశాత్తు గాయపడిన సీనియర్ జర్నలిస్టు రాజశేఖర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహన్, ఏబూసి సంపత్
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 23
హుజురాబాద్ నియోజకవర్గం టి డబ్ల్యూ జె ఎఫ్ కమిటీ సమావేశం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు యోహాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పెద్దపెల్లి జిల్లా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ బందెల రాజశేఖర్ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి పడి కాలు కోల్పోయాడని అతనిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గత ప్రభుత్వం 10 సంవత్సరాలు జర్నలిస్టుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు గాని జర్నలిస్టు లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టకుండా జర్నలిస్టులను అనేక ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టు సమస్యల పైన ప్రత్యేక దృష్టి పెట్టి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భూపతి సంతోష్, జిల్లా సహాయ కార్యదర్శి దొడ్డే రాజేంద్రప్రసాద్, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు, సౌడమల్ల యోహాన్, ఏబూసి సంపత్,వలపి రెడ్డి శ్రీనివాస్,ఎండి కాజా ఖాన్, దయ్యాల సుధాకర్, రచ్చ రవికృష్ణ, ఎండి రఫిక్, కొండ విజయ్, పెద్ది సంతోష్ కుమార్, వంశీకృష్ణ,నాగపురి రాజు, రాజేంద్రప్రసాద్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
