సిపియం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం
కక్కిరేణిలో సిపియం పోరుయాత్ర
కక్కిరేణి గ్రామంలో అపరిష్కృతంగా పేరుకుపోయిన ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపియం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపై నిర్వహించిన సిపియం పోరుయాత్ర సందర్బంగా గ్రామ శాఖ నాయకులతో కలసి గ్రామంలో పలు వీదులు పరిశీలన చేసి సర్వే నిర్వహచారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కక్కిరేణి నుండి రామన్నపేట,మాండ్ర, పిల్లిగూడెం మరియు అక్కేనపల్లి,ఎన్నారం వెళ్ళే రహదారులు గుంతలమయంగా మారి ప్రయాణాలు నరకప్రాయంగా మారాయి. కక్కిరేణి నుండి రామన్నపేట వరకు బిటి రోడ్డు ద్వంసమయి ఆర్.టి.సి బస్సు సర్వీసు లేక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు.నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో,నాసిరకం పనులతో మెట్లు,రీలింగ్ కూలిపోయి ప్రమాదకరంగా మారింది. నీటి ట్యాంకు శుద్ది చేయాలన్నా చేయలేని పరిస్థితి అదేవిదంగా 8వ వార్డులో రెండో సారి సిసి వేసిన మళ్ళీ రోడ్డుపై మురుగు నీరు నిలిచి దోమల విహారంతో పరిసర గృహాల వారు రోగాల భారిన పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
2017 సం,, కోటి తొంబై లక్షలతో నిర్మించిన అసీఫ్ నహర్ కాల్వపై వంతెన 7 సం.పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. అంగన్ వాడీలకు సొంత భవనాలు లేక ఇతర భవనాల్లో కాలమెల్లదీస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్యం లోపించి పరిపాలన పడకేసిందని వెంటనే అధికారులు గ్రామంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపియం మండల కమిటి సభ్యులు వేముల సైదులు,శాఖ కార్యదర్శి కన్నెబోయిన యాదయ్య,నాయకులు శివ కుమార్,సురేష్,పూలమ్మ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.