జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 31
జమ్మికుంట పట్టణంలో వర్షం దంచి కొట్టింది. శనివారం ఉదయం 11 గంటల కు గంటసేపు కుండపోత కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా జమ్మికుంట హుజరాబాద్ ఫ్లైఓవర్ ఇరువైపులా భారీగా నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు వర్షాలదృష్ట అధికార యంత్రాంగం అప్రమత్తమై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
