శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్
ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
అంబర్పేట్ ప్రజాబలం ప్రతినిధి:బుధవారంనాడు బతుకమ్మ కుంట ను హైడ్రా కమిషనర్ రంగనాథన్ పర్యటించి పనులను ప్రారంభించారు. రెండు నెలలలో ఈ యొక్క బతుకమ్మ కుంట సుందరీ కరణ పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. గత నలభై ఏళ్లుగా కబ్జాకి గురి అయిన బతుకమ్మ కుంట పైన మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు పోరాటం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఒక నీటి సరస్సు వాకర్స్ వాకింగ్ చేయడానికి వీలుగా వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే విధంగా ఉద్యానవనం, జిమ్ లాంటి అన్ని సౌకర్యాలు గల ఒక సుందరమైన సరస్సును ఇక్కడ నిర్మించాలని వి. హనుమంతరావు గారు కోరారు. ఈ సందర్భంగా ఈరోజు బతుకమ్మ కుంట ను హైడ్రా కమిషన్ రంగనాథన్ సందర్శించి, ఈ బతుకమ్మ కుంట పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ వి హెచ్ ఆర్ కోరిన విధంగా అన్నిఅభివృద్ధి పనులు జరిగేలా చూస్తామని తెలియజేశారు.