పదవి విరమణ పొందిన అధికారులను సన్మానించి జ్ఞాపకాలు అందజేసిన సిపి
అధికారులకు,సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం
పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 30 : పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ఎస్సై హెడ్ కానిస్టేబుల్ లను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ఇద్దరు పోలీసు అధికారులను వారి కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా,పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రోజు పదవీ విరమణ పొందిన ఎం.సర్కార్ సబ్ ఇన్స్పెక్టర్.జన్నారం పోలీస్ స్టేషన్ 1983 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా ఎదిగి 41 సంవత్సరముల 02 నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది.వి.శంకరయ్య హెడ్ కానిస్టేబుల్,మంథని పోలీస్ స్టేషన్,1993 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 31 సంవత్సరముల15 రోజులు విధులను నిర్వర్తించడం జరిగింది.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురా రోగ్యాలతో,సుఖసం తోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,ట్రాఫిక్ ఏసిపి నరసింహులు,ఎఆర్ ఎసిపి ప్రతాప్,సురేంద్ర,ఏఓ అశోక్ కుమార్,రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు మధు,సంపత్, సూపరింటెండెంట్ సంధ్య, సిసి పవన్ రాజ్,గౌస్ రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం,స్వామి,పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.