దండేపల్లి మండల బిజెపి సభ్యత్వ సమావేశం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 30 : బిజెపి జాతీయ పార్టీ ఆదేశానుసారం శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలలోని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ బీజేపీ మండల కన్వీనర్ కర్నాల కిషన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య మండల ఇన్చార్జి గుండా ప్రభాకర్ పాల్గొని ప్రతి బూత్ నుంచి 200 మంది సభ్యత్వం తగ్గకుండా చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మండల కన్వీనర్ లను సహా ఇంచార్జిలను శక్తి కేంద్ర ఇన్చార్జులు సహా ఇంచార్జిలు విధంగానైతే నియమించినమో అదేవిధంగా ప్రతి బూత్ నుంచి కూడా కన్వీనర్ కో కన్వీనర్ నిర్వహించి పెద్ద ఎత్తున సభ్యత్వం అయ్యేవిధంగా కృషి చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.మండల ప్రధాన కార్యదర్శి ఎంబడి సురేందర్,మండల కో కన్వీనర్లు పత్తిపాక సంతు,వనపర్తి రాకేష్,శక్తి కేంద్ర ఇన్చార్జులు సహా ఇన్చార్జులు మండల కమిటీ సభ్యులు బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking