తెలంగాణ లో సన్న బియ్యం పంపిణీ పథకం దేశానికే ఆదర్శం

బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నలిమేల రాజు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 01 : మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం లక్షెట్టిపేట మండలంలోని వెంకటరావుపేట, మండలంలోని అన్ని గ్రామాల్లో రేషన్ షాపులలో సన్న బియ్యం పథకం అమలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నలిమేల రాజు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అమలు పథకాన్ని దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కొనియాడారు మంచిర్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు పాలన దక్షితతో రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానం లో నిలుస్తుంది అని అన్నారు.సన్న బియ్యం పథకం నిరుపేదల కళ్ళలో ఆనందం నింపిందని అన్నారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి పౌరసరాపరల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ కి లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు గ్రామ గ్రామాన ప్రజలు ఇట్టి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్న బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నలిమెల రాజు మండల పార్టీ అధ్యక్షుడు పింగళి రమేష్ వెంకట్రావుపేట్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తుల మురళి మాజీ సర్పంచ్ నిమ్మాద్రి మాజీ వార్డు సభ్యులు తోట రాజయ్య బండి రాయలింగు సంఘ శంకరయ్య మెరుగు లింగన్న కల్లూరి అశోక్ కల్లూరి లచ్చన్న దుర్గం నాని కోన శ్రీహరి గ్రామ యూత్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ గంగుల రాజ్ కుమార్ క్రుందారపు ప్రసాద్ గంధం శేఖర్ దాసరి సురేష్ శ్యామల వెంకటేష్ ఆకిరెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking