అడ్వకేట్ జగన్ మోహన్, బిఏస్పీ జిల్లా ఇంచార్జీ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. విద్యాహక్కు చట్టం 2009 ని పకడ్బందీగా అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో విద్యను ఒక వ్యాపారంగా మార్చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి చర్యలకు గత పాలకులు స్వీకారం చుట్టారని పేర్కొన్నారు, మార్పు కోసం అధికారంలోకి వచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టం 2009 పకడ్బందీగా గా అమలు చేయాలని కోరారు.
ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు, పేదలకు ఉచితంగా 25% సీట్లను కేటాయించాలని నిబంధనలు ఉన్నప్పటికీని, ప్రైవేట్ పాఠశాలలో ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యాహక్కు చట్టం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,ప్రతి గ్రామంలో పర్యటించి విద్యాహక్కు చట్టం కమిటీలు వేసి భవిష్యత్తులో కచ్చితంగా విద్య హక్కు చట్టం అమలయ్యే విధంగా చూడాలని కోరారు