నిర్మల్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు ఆకస్మిక తనిఖీలు విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా

నిర్మల్ జిల్లా కేంద్రం లోనీ సోఫీనగర్ గురుకుల పాఠశాలతో పాటు నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్ మండల కేజీబీవీ లను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రిజిస్టర్లు, హాజరు బుక్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి…వారికి అందుతున్న వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు, వారికి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ను అందజేశారు.
ఎలాంటి సమస్య ఉన్నా.తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల సిబ్బంది, విద్యాశాఖ అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking