శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్
ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని చెట్ల గౌరారం గ్రామం (19) సిసి కెమెరాలు, మరియు రంగాయపల్లి గ్రామంలో (21) సిసి కెమెరాలు MS AGARWAL కంపెనీ దాతల సహకారంతో రెండు గ్రామాల్లో కలిపి మొత్తం (40) సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు హాజరై ప్రారంభించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్నో దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని కేసులు చేధించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని అందువల్ల సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాల్లో ప్రదాన కూడల్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమ అనంతరం చెట్ల గౌరారం గ్రామంలో జిల్లా ఎస్.పి గారు మొక్కలు నాతే కార్యాక్రమంలో పాల్గొని మొక్కలను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ సి.ఐ.శ్రీ.శ్రీధర్ గారు, మనోహరాబాద్ సి.ఐ.శ్రీ.సందీప్ రెడ్డి గారు, మరియు దాతలు MS AGARWAL కంపెనీ నుండి J.షణ్ముఖేశ్వరరావు- HR మరియు అడ్మిన్ హెడ్ గారు,రాజీవ్ గౌరవ్ – మేనేజర్ అడ్మిన్ గారు, అజ్మత్ అలీ – మేనేజర్ HR గారు, వైస్ ఎంపీపీ విటల్ రెడ్డి టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ పురం మహేష్ మరియు రంగాయిపల్లి గ్రామ సర్పంచ్ నాగభూషణం గారు, చెట్ల గౌరారం గ్రామ సర్పంచ్ మల్లయ్య గారు, కోనాయిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ పరికిబండ సర్పంచ్ పూల అర్జున్ మరియు రెండు గ్రామాల వార్డు మెంబర్లు, ప్రజలు సిసి కెమెరా టెక్నీషియన్ బిక్షపతి పాల్గొన్నారు.