మీకు అండగా మేముంటాం – మీ క్షేమం మా బాధ్యత జిల్లా ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్ తగిన జాగ్రత్తలు పాటించండి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా నిర్మల్ జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా వ్యవహరించాలని అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా ఎస్పీ .తెలియజేసారు. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం ఎదురైతే సహాయానికై వెంటనే డయల్ 100 చేయాలనీ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించవలసిందిగా కోరారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యుత్ తీగల కు దూరంగా ఉండవలెను.విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు.
చిన్నపిల్లలను బయటకు అస్సలే పంపరాదు.
సాధ్యమైనంతవరకు ఇంట్లో గల ఎలక్ట్రానిక్ వస్తువుల కేబుల్స్ విడిగా ఉంచాలి.
పిడుగుపాటు దృశ్య వర్షంలొ ఎవరు చెట్ల కింద ఆశ్రయం పొందరాదు. పొలాల వద్దకు రైతులు ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకుపోరాదు.
తీవ్రమైన ఈదురు గాలులు మరియు భారీ వర్షాల వలన చెట్లు విరిగి ఎలక్ట్రిక్ వైర్స్ పై పడడం వల్ల రహదారులు, పొలాల పై పడి ఉంటాయి కావున రైతులు జాగ్రత్తగా గమనించాలి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులను ఆహారాన్ని జాగ్రత్త పరుచుకోవాలి.
కూలిపోయే స్థితిలో ఉన్న మట్టి గోడలతో ఉన్న ఇల్లులు పాత భవనాలు వెంటనే కాలి చేసి సురక్షత ప్రాంతాలకు వెళ్ళాలి.
వర్షాల కారణంగా బ్లాక్ అయిన రహదారులను జాగ్రత్తగా దాటాలి. రోడ్ల పై గల మ్యానహోల్స్ కు దూరంగా నడవవలను.
వర్షం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. కావున పరిమిత వేగంతో నడపాలి. అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దు.
ఉదృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళరాదు. వర్షాల కారణంగా ప్రభలే విషజ్వరాలు, అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
సాధ్యమైనంతవరకు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వలన ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి.
మీ క్షేమం మా బాధ్యత. దయచేసి సూచనలు పాటించండి. జిల్లా పోలీస్ యంత్రాంగానికి సహకరించండి.

Leave A Reply

Your email address will not be published.

Breaking