ఎవరికోసం ఈ ప్రయత్నం..! ఎవరికోసం.. ఎవరు మారాలి?

ప్రజాబల: హైదరాబాద్. మోడువారిన వృక్షం మొగ్గేసి కాయ కాసింది. తన విధిని నిర్వర్తించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. తన జాతిని పెంచుకోవడం కోసం విధిగా మనకోసం ప్రయత్నం చేస్తుంది. తనకోసం తక్కువే కానీ మనకోసమే ఆదర్శంగా నిలుస్తోంది.
జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను అన్నీ దారులు మూసుకుపోయినాయి నాకు అని బ్రతుకుపై ఈ ఆశ చాలించుకున్న, నిరాశ నిస్పృహ కోల్పోతున్న జీవితాలకు ఒక పాఠం ఈ చిత్రం. నరికేసిననా మొండితనంతో ముందుకెళుతూ కచ్చితంగా నేను సాధించగలను అనే దృఢ సంకల్పం కలిగించడానికి ఆదర్శం ఈ చిత్రం. నరికేసిన వృక్షానికి ఉన్నటువంటి క్షమాగుణం దయాగుణం మనలో ఎందుకు ఉండకూడదు ఎవరికోసం అది ముగ్గేసింది ఎవరికోసం పూత పూసింది ఎవరి కోతము ఖాతకాల్సింది ఒక్కసారి మనం ఆలోచించాలి తను నరికిన సర్వస్వాన్ని కోల్పోయిన తన ప్రయత్నం మాత్రం మారలేదు మానలేదు మానలేదు ఇది వృక్షానికి ఉన్నటువంటి గొప్ప దాతర గుణం దాత గుణం. ఈ గొప్ప గుణం ఉన్న ఆ చెట్టు కాయలను కాసి మనకిస్తూ మనల్ని ప్రశ్నిస్తోంది. మారమని ప్రశ్నిస్తోంది. నీలో మార్పు తెచ్చుకో అని ప్రశ్నిస్తుంది. మనం ముండ్లేస్తే అది పూలనిస్తోంది, మనము కాటు వేస్తే అది కాయలను ఇస్తుంది, ఎంత మార్పు మనలో కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన, సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు సంధిస్తోంది ఈ నరుకబడి మోడువారిన వృక్షపు మొండెము మొదలు చెట్టు.
జీవితంలో నేను ఓడిపోయాను, ఎంత ప్రయత్నించినా నేను గెలవలేకపోయాను అని నిరుత్సాహ పడుతూ జీవితంలో అన్నీ కోల్పోయాను అని మానసికంగా చెదిరిపోయి బెదిరిపోయి అన్నగారి పోయిన జీవితాలకు ఒక వెలుగు నిచ్చే, బ్రతుకు పై ఆశ కల్పించే చిత్రం ఈ చిత్రం. తనదైన ధర్మాన్ని పాటిస్తూ తనపై ఒక గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకొని ఖచ్చితంగా నేను సాధించగలను నేను చివరి తుది శ్వాస వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని ఆ ప్రయత్నం వైపు పరిగెత్తి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత విఘాతం ఏర్పడిన చివరకు గెలిచి చూపించాలి అనేది ఈ చిత్రం ద్వారా మరొక సందేశం.
జీవనగమనంలోని బ్రతుకు పోరాటంలో ఎన్ని విఘాతాలు కలిగించిన, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలను దాటి వేసుకుంటైనా మనం అనుకున్న గమ్యాన్ని చేరొచ్చు అన్నది ఈ వృక్షాన్ని చూసి మనము తెలుసుకోవాల్సిన గమనించాల్సిన ధైర్యం చేసుకుని ముందుకు నడవాల్సిన విషయం. జీవితం అంటే, జీవించడం అంటే అంత ఆషామాసి కాదు, ఎదురు నిలిచి సాధించి గెలవాలన్నది ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అడ్డంకులు తొలగించుకుని ముందుకు పయనించడమే జీవితం యొక్క లక్ష్యం అని చెప్పకనే చెబుతుంది ఈ చిత్రం. అపూర్వమైన ఈ అరుదైన చిత్రం. ప్రకృతి నుంచి మనము ఎన్నో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తనను మనము నాశనం చేస్తున్న… మన మేలుగోరి మనకు సహకరిస్తూనే ఉంటాయి వృక్షాలు. తన జీవితం మనకోసమే శాశ్వతంగా ఉన్నట్టు మనకు జవాబులను సంధిస్తుంది… ప్రశ్నల అడుగుతూనే… ప్రశ్నిస్తూనే.
మనమే మారాలి. ఎందుకు మారాలో ఈ తెగిపోయిన శరీరాన్ని, నరికి వేసిన మనల్ని ప్రశ్నిస్తూ మనకు జవాబు దారిగా నిలబడుతోంది. ఈ నరకబడిన వృక్షపు భాను కొమ్మలపైననే కాదు మీరు నరికి వేసిన మొదల నుండి కూడా నేను మళ్లీ పుట్టుకొచ్చి మీకు, మీ జీవితాలకు ఆహారాన్ని అవుతూ, మీకు ఆదర్శంగా ఉంటాను… అంటుంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. చిత్రాన్ని పెట్టి, అందరిలో మార్పు తీసుకురావాలని అనుకున్న మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ వృక్షో రక్షతి రక్షితః అన్న ప్రాచీన కాలపు సంస్కృతపు నానుడి నిజముగా మనము కళ్ళతో చూడొచ్చు ఈ చిత్రం ద్వారా. వృక్షాలను మనం నరికివేసిన అవి మనకు అన్ని రూపాల్లో మనల్ని కాపాడుతూ వస్తూనే ఉన్నాయి. తమ చివరి శ్వాస వరకు మనకు శ్వాసనిస్తూనే ఉన్నాయి. తమ కు వీలైనంత పరిధిలో మనకు ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాయి. అలాంటి వృక్షాలను మనం నరికి వేయకూడదు. వృక్షాలను నరికి వేస్తే మనల్ని మనం నరికి వేసుకున్నట్టే.
— రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, జేఎన్టీయూహెచ్,

Leave A Reply

Your email address will not be published.

Breaking