నాసిరకం పనులకు మణికొండ నిలయం

వార్డ్‌ 8 కౌన్సిలర్‌ ఆలస్యం నవీన్‌ కుమార్‌
మణికొండ ప్రజాబలం ప్రతినిధి:ప్రజల సౌకర్యార్థం మణికొండ మునిసిపల్‌ కౌన్సిల్‌ వార్డ్‌ 8 అంతర్భాగమైన అలకాపురి కాలనీలో విద్యుత్‌ స్థంబాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ తీగలను సమకూర్చి కావలిసిన విద్యుత్‌ దీపాలు (బల్బ్‌ లు) కావాలని మునిసిపల్‌ అధికారులకు తెలియపరుస్తూ గత ఆరు నెలల క్రితం కౌన్సిల్‌ లో తీర్మానం చేసినను, ఎట్టకేలకు మే 2 న స్థంబాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు అశ్రద్దతో విద్యుత్‌ తీగలను కాని, దీపాలను కాని ఏర్పాటు చేయనందున, చేసిన పనులు నాసిరకంగా చేసినందున, పర్యవసానంగా స్థంబాలు వొరిగి పోవడం అన్నది బాధాకరం, నాసిరకంగా అమర్చిన పోల్స్‌ ఎప్పుడు పడతాయో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని వార్డ్‌ 8 కౌన్సిలర్‌ ఆలస్యం నవీన్‌ కుమార్‌ తెలియ జేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking