హైదరాబాద్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల 62 సెం. విూ ల వర్షపాతం, 47 సెం. విూల వర్షం ఇలా భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ఇచ్చారు. సికింద్రబాద్ కంటోన్మెంట్ మిలట్రీ అధికారులతో చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టం అవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.
ఇప్పటికే మోరంచపల్లికి తరలిన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ళిఎన్డీఆర్‌ఎఫ్ బృందాలురి. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందిస్తున్నారు. ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Prev Post