ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ గడ్డపై మొట్టమొదటిసారి కాషాయ జెండా రెపరెపలాడింది.బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర రెడ్డి తన సమీప ప్రత్యర్థి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగగా ఆదివారం రోజున ఎన్నికల ఓట్ల లెక్కింపును స్థానిక నిర్మల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. మొదటి రౌండ్ నుండి బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై ఆదిపత్యం చెలాయిస్తూ చివరి రౌండ్ వరకు అధిపత్యాన్నికొనసాగించారు.హైట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుందామని ఆశపడ్డ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఏలేటి మహేశ్వరరెడ్డి భారీ షాక్ఇచ్చారు.మూడవసారి ముచ్చటగా గెలుపొంది నిర్మల్ గడ్డను గెలవాలానుకున్న మంత్రి ఆశలపై నీళ్లు చల్లుతూ 50703 వేల పైచిలుకు మెజారిటీతో ఏలేటి మహేశ్వరరెడ్డి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన అల్లోలకు వ్యతిరేక గట్టిగా వచ్చింది. దీంతో బిజెపికి వన్ సైడ్ ఓట్లు రాగా కమలం పువ్వుకు ప్రజలు పట్టం కట్టారు. మైనారిటీ ఓట్లను నమ్ముకుని బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత శ్రీ హరిరావు ఈ దశలోను ఢీకొట్టలేదు. కాంగ్రెస్.3వ స్థానములో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు పడతాయని అనుకున్నప్పటికీ, మైనారిటీ ఓట్లు దాదాపు బిఆర్ఎస్ కు పడ్డట్లు తెలుస్తుంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి పై భారీ మెజారిటీతో గెలుపొందారు