కుటుంబ సభ్యులతో కలిసి జీవితం ఆనందంగా గడపాలి
అధికారులకు,సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31: పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ముగ్గురు ఎస్సై లను బుధవారం రోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులను వారి కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా,పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.పదవీ విరమణ పొందిన ఎం.రాజేంద్ర ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్.1981 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా ఎదిగి 43 సంవత్సరముల 14 రోజులు విధులను నిర్వర్తించడం జరిగింది. దత్తు ప్రసాద్ శర్మ సబ్ ఇన్స్పెక్టర్ 1982 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 41 సంవత్సరముల 11 నెలల,8 రోజులు విధులను నిర్వర్తించడం జరిగింది.అబ్దుల్ సత్తార్ ఎస్సై1983 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 41 సంవత్సరముల 29 రోజులు విధులను నిర్వర్తించడం జరిగింది.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.