ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31 : మహిళలపైన జరుతున్న అకృత్యాలపై నిరసిస్తూ బుధవారం రోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో దండేపల్లి బీజేపీ మోర్చా మండల అధ్యక్షురాలు అక్కల దివ్య ఇంటి వద్ద పోలీసులు ఉదయం 5 గంటలకు వారి ఇంటి వద్ద ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.బుధవారం ఈ సందర్బంగా అక్కల దివ్య మాట్లాడుతూ…మహిళలపైన జరుగుతున్న అకృత్యల నుండి మహిళలను రక్షించడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా పోలీసులను ఇంటి మీదికి పంపించి ఇబ్బందులు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.మహిళ అర్ధ రాత్రి ఒంటరిగా సురక్షితంగా రోడ్డు మీద తిరిగినప్పుడే భారత దేశానికి స్వాతంత్ర వచ్చినట్టు అని చెప్పిన మహాత్మా గాంధీ మాటలకు విలువ లేకుండా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మనకి స్వాతంత్ర వచ్చిందా లేదా అని సమాధానం చెప్పాలి అని అన్నారు.మహిళలలకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఉచిత ఆర్ టీ సీ బస్ అని పెట్టడం వ్యర్థం అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించాలి అని ఇప్పటి వరకు అన్యాయం జరిగిన వారికి న్యాయం చెయ్యాలని.మహిళలను హింసించే వారిని వెంటనే అక్కడికక్కడే నిర్ధాక్షినంగా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.ఇలాంటి అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదని తెలియజేసారు.