జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం) ఖమ్మం రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్, పోలీస్ స్టేషన్ నూతన భవనాల నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయ భవనంలో తహసీల్దార్ గది, సిబ్బంది గది, రికార్డు రూమ్ లను పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది టాయిలెట్స్ తో పాటు, పబ్లిక్ టాయిలెట్స్ ల నిర్మాణం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ భవనంలో వాష్ రూం, వెయిటింగ్ షెడ్లు, రిషిప్షన్, ఫెలిసిటేషన్ సెంటర్, పార్క్ కు ప్రణాళిక చేయాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ముందు ఖాళీ స్థలంలో మంచి మొక్కలు నాటుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా రఘునాథపాలెం మండల తహసీల్దార్ నర్సింహారావు, ఎంపిడిఓ రామకృష్ణ, పీఆర్ ఎఇ ఆదిత్య రాజు, అధికారులు తదితరులు ఉన్నారు.