ఖమ్మం ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అద్యక్షతన సాదారణ సర్వసభ్య సమావేశం జరిగింది
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కె.చంధ్రశేఖర్‌రావు అకాల వర్షాల వల్ల పంటనష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఒక్కో ఎకరానికి 10 వేల రూపాయలను పునరావసం క్రింద అందించేందుకు ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో అంశాన్ని ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాలకు జిల్లా స్థాయి అదికారులందరూ హాజరు కావాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు తెలిపారు. పలు మండలాల్లో ప్రజాప్రతినిధులు త్రాగీనీటి సమస్య ఉందని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాదానమిస్తూ వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిదులు సమన్వయంతో సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కంటి వెలుగు కార్యక్రమం, ఆరోగ్య మహిళా కేంద్రాల్లో అందించే వైద్యసేవలపై నివేదికను వివరించారు. జిల్లాలో ఒక కరోనా కేసు నమోదు అవ్వడం జరిగిందని, దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా పేషెంట్‌కు ప్రత్యేక వార్డులో చికిత్స అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మహిళల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇంకా సబ్ సెంటర్లు ఎక్కడ అవసరమున్నది గౌరవ సభ్యులు ప్రతిపాదించినచో ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుంన్నారు.
పంక్షేమ శాఖ అధికారి మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఏడు ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో 1605 మెయిన్ మరియు (235) మిని మొత్తం 1840 అంగన్‌వాడీ కేంద్రములు నిర్వహించబడుతున్నాయని, గర్భీణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం బాలామృతం కోడి గ్రుడ్లు, మధ్యాహ్నం సంపూర్ణ భోజనం అంగన్వాడి కేంద్రంలో అందించడం జరుగుతున్నదని మహిళా సంక్షేమ అధికారి నివేదిక వివరించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహాత్మాగాంధీ జాతీయ గ్రామాణ ఉపాధి హామీ పథకము క్రింద 2022`23 ఆర్ధిక సంవత్సరమునకు 81.16 లక్షల పనిదినములతో రూ.347.37 కోట్లతో లేబర్ బడ్జెట్‌ను శ్రీయుత కమీషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ వారు లక్ష్యముగా ఇవ్వడం జరిగిందని 3,03,797 కుటుంబాలలోని 6,44,673 మందికి జాబ్‌కార్డులు జారీచేయడం జరిగిందన్నారు. దీనికి గాను రూ.115.13 కోట్లు ఖర్చుచేయడం జరిగిందన్నారు. ఒక కుటుంబానికి సరాసరి 39 రోజులు పనులు కల్పించడం జరిగిందని వివరించారు. అర్హత కలిగిన వారికి ఆసరా పింక్షన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాదానమిస్తూ సుమారు 6 వందల దరఖాస్తుల్లో ఈ.కె.వై.సి సమస్య ఉన్నట్లు ఆధార్ ఆప్‌డేట్, ఐరిస్ రెండు సరిచేయాల్సి ఉందన్నారు. త్వరితగతిన సరిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.ఆప్పారావు, విద్యుత్, వైద్య ఆరోగ్య, సంక్షేమ, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల జిల్లా అధికారులు, జడ్పీటిసీలు, ఎం.పి.పిలు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.