తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27 : తరుగు పేరిట రైతులను రాష్ట్ర ప్రభుత్వంమోసం చేస్తుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జాప్యాలను నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 63వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రైతులు రాస్తారోకో చేపట్టారు.వడ్ల కొనుగోలు సెంటర్లలో జరుగుతున్న మోసాలను ఆపాలని,గూడెం లిఫ్ట్ ద్వారా,వడగండ్ల వానల వలన నష్టపోయిన రైతులకు నష్టరిహారం ఇవ్వాలని అన్నదాతలు ఆందోళన చేపట్టారు.వరి ధాన్యం కొనుగోలులో జాప్యం,తూకానికి సంబంధించిన రసీదులు ఇవ్వకపోవడం,తరుగు పేరుతో తూకంలో మోసాలు ఆపాలని డిమాండ్ చేశారు. అన్నదాతల ఆందోళన కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకులు మద్దతుగా నిలిచారు.ఈ సందర్బంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేస్తామని కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇంకా అనేకచోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని, ప్రారంభించిన చాలా చోట్ల రసీదులు రైతులకు ఇవ్వకపోగా,క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరువు పేరా కోత విధించి దోపిడీకి పాల్పడుతున్నారని వాపోయారు.గూడెం లిఫ్ట్ ద్వారా నష్టపోయిన రైతులకు ఇప్పటికి పరిహారం అందలేదన్నారు.అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే మరోవైపు దోపిడీతో రైతులను నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు ఏర్పాటు చేసి తరుగు లేకుండా తూకం వేయాలని, రసీదు ఇవ్వాలని,నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు,అన్నదాతలు డిమాండ్ చేశారు.రాస్తారోకో సుమారు గంట సేపు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking