రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచాలి

 

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ వాటా 300 లను 3000 లకు పెంచాలి

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

రాష్ట్ర వ్యాపితంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలు

….ఆర్ వెంకటేష్ రాష్ట్ర కోశాధికారి.

సంగారెడ్డి/రంగారెడ్డి జులై 03 ప్రజ బలం ప్రతినిది:
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ వాటాను 300 లను 3000లకు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ 6000లకు పెంచాలని,అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
*ఈ సందర్బంగా ఎన్ పి ఆర్ డి రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, హైదరాబాద్ సౌత్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి శశికల మాట్లాడుతు 2011 నుండి కేంద్ర ప్రభుత్వం వాటా పెన్షన్లలో కేవలం 300 రూపాయలు మాత్రమే ఉంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలి. ధరల పెరుగుదల సూచి ఇండెక్స్ కు పెన్షన్స్ ను అనుసంధానం చేయాలి.ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న పెన్షన్ వాటాను 3000 లకు పెంచాలని డిమాండ్ చేశారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6000 లకు పెంచి వెంటనే అమలు అమలు చేయాలి. 2024 జనవరి నుండే పెరిగిన పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి 7నెలలు గడుస్తుంది.పెన్షన్స్ పెంపు కోసం 44,49,767 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.కొత్త దరఖాస్తు చేసిన 24.84 లక్షల మందికి ఇప్పటికి పెన్షన్ మంజూరు కాలేదు. 2014 రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్స్ మంజూరుకు ఆదాయ పరిమితి విధిస్తూ జీవో 17ను విడుదల చేసింది.దీన్ని వెంటనే రద్దు చేయాలి.2015కంటే ముందు సదరం సర్టిఫికెట్ పొందిన వారి ఆన్లైన్లో ప్రింట్ తీసుకునే అవకాశం లేదు. 2015 కంటే ముందు ఇచ్చిన సదరం సర్టిఫికెట్స్ లను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి.రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల గుర్తింపు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి.ప్రతి నెల 5వ తేదీలోపు పెన్షన్స్ పంపిణి చేసే విదంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటిన్లలో వికలాంగులకు 5శాతం కేటాయించే విదంగా చర్యలు తీసుకోవాలి.తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలావేన్స్ కోసం లబ్ధిదారుల గుర్తింపు పక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు జగదీష్, కార్యదర్శి నాగమణి, హైదరాబాద్ జిల్లా నాయకులు రాజు, సంజీవ, నర్సింగ్, కుమార్, మమత, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking