సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రవి ప్రసాద్‌ గౌడ్‌.

యాకత్‌పూర ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ విమోచనంలో కీలకపాత్ర వహించిన సర్ధార్‌ వల్లబాయ్‌ టేల్‌ గారి విగ్రహాన్ని గుజరాత్‌ తరహాలో తెలంగాణలో ప్రతిష్టించాలని రవి ప్రసాద్‌ గౌడ్‌ పేర్కోన్నారు. సెప్టెంబర్‌ 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ఘనంగా నిర్వహించే విమోచన దినోత్సవ ఉత్సవాలలో పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రతి డివిజన్లో జాతీయ జెండా ఎగురవేసి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. సుధీర్ఘ పోరాటం తర్వాత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే,13నెలల తర్వాత రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాటం చేసి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గారు చేపట్టిన ఆపరేషన్‌ పోలో ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణకు విమోచనం లభించిందని పి రవి ప్రసాద్‌ గౌడ్‌ అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజా పాలన దినోత్సవం అని ప్రకటించడం అనేది కేవలం ఎంఐఎం ను సంతృప్తి పరచడం కోసం మాత్రమేనని, తెలంగాణ విమోచనం కోసం ఎంతో మంది అమరులయ్యారని వారి త్యాగాలని గుర్తించడానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ సమాజం భావిస్తుందని ఆయన అన్నారు. ఆనాటి రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వి వారసత్వానికి సంబంధించిన పార్టీ ఎంఐఎం పార్టీ అని ఆయన ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో గత మూడు సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా మరియు కేంద్ర బొగ్గు ఘనుల శాఖ మంత్రి జీ.కిషన్‌ రెడ్డి గారి నేతృత్వంలో విమోచన దినోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. సెప్టెంబర్‌ 17న ఉదయం 8 గంటలకు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ఘనంగా జరగబోయే ఉత్సవాలలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, గజేంద్ర సింగ్‌ సేఖావత్‌, బండి సంజయ్‌ గార్లు పాల్గొంటారని కావున తెలంగాణవాదులు, యువత పెద్ద ఎత్తున పాల్గోనాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రవి ప్రసాద్‌ గౌడ్‌ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking