30వేలు నగదు సహాయం
భాదుతుడి కుమారునికి విధ్యభాసానికి భరోసా
ఎమ్మెస్సార్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎం.శశిధర్ రెడ్డి
తూప్రాన్, సెప్టెంబర్, 16. ప్రాజబలం న్యూస్ :-
తూప్రాన్ మున్సిపల్ పరిధి పోతరాజుపల్లి కి చెందిన వేణుగోపాల్ టోల్ గేట్ లో ఉద్యోగం నిర్వహిస్తుండగా అనారోగ్యంతో పక్షవాతం వచ్చి కదులలేని విధంగా మంచానికే పరిమితం అయ్యాడు. విధి వక్రీకరించి ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆర్థిక సంక్షోభం తో పూట గదువలేని కడుదయనియమైన స్థితిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు ఎమ్మెస్సార్ ఫౌండేషన్ తరపునా చైర్మన్ డాక్టర్ ఎం.శశిధర్ రెడ్డి మానవత్వం చాటి చేయుతను అందించారు. వేణుగోపాల్ దీన స్థితి గతులు తెలుసుకున్న ఎమ్మెస్సార్ ఫౌండేషన్ తరపునా చైర్మన్ డాక్టర్ ఎం.శశిధర్ రెడ్డి సోమవారం తన మిత్ర బృందం తో పోతరాజుపల్లి లో ఉన్న భాధితుడు వేణుగోపాల్ ఇంటికి చేరుకుని 30 వేల రూపాయలు నగదు సహాయం అందించడమే కాక అతని కుమారుణ్ణి ప్రయోజకున్ని చేసే గురుతర బాధ్యతను తీసుకున్నారు. అతని విధ్యభాసానికి కావల్సిన ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎం.శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తమ స్వచ్ఛంధ సంస్థ ఎమ్మెస్సార్ ఫౌండేషన్ తరపునా మానవతా దృక్పథంతో చేయుత అందించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి అర్హులైన వారికి తమ అండదండలు ఎప్పటికీ ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంతంలో జెన్యూన్ గా అర్హులైన నిజంగా కొట్టుమిట్టాడుతున్న వారికి చేయుతందిస్తామని తెలిపారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి వేణుగోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎం.శశిధర్ రెడ్డి తోపాటు వంశిధర్ రెడ్డి, రహీమ్, దీక్షిత్ రెడ్డి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.