తెలంగాణరాష్ట్రంలో స్వర్ణకార సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనితెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది
తెలంగాణరాష్ట్రంలో స్వర్ణకార సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనితెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.మావి గొంతెమ్మ కోర్కెలు కాదని, సెప్టెంబరు 15 లోపు మా డిమాండ్లు పరిష్కరించక పోతే వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టుతామని క సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవా చారి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి,
కోశాధికారి జి.చంద్రశేఖర్, నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.నాకు స్వర్ణకారుల ఇబ్బందులు, బాధలు తెలుసునని సీఎం కేసీఆర్ చెప్పేవారని, ప్రస్తుతం కార్పోరేట్ వ్యవస్థ వలన
తమ వృత్తి కోల్పోయి, ఉపాధి లేక,ఆకలి చావులకు గురవుతున్నామని,కొంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారన్నారు.అలా పాల్పడ్డ వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
నిత్యం బంగారు తెలంగాణ అని చెబుతున్న కేసీఆర్, రాష్ట్రంలో స్వర్ణకార వృత్తి చేసే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సామాజిక వర్గం సమస్యల పరిష్కారం కోసం జోలె పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ఆర్థిక చేయుతనందిస్తుంది, కానీ తామకు ఎలాంటి చేయూత లేదని, తాము ఏమి పాపం చేశామని ప్రశ్నించారు.స్వర్ణకార సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 272కి సవరణలు చేసి అమలు చేయాలని, వివాహ సమయంలో పుస్తె, మట్టెలు, ప్రధాన ఉంగరం స్వర్ణకారులే చేసే విధంగా ప్రత్యేక జీవో తీసుకురావాలని, 50 సంవత్సరాలుపై పడ్డ స్వర్ణకారులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సెప్టెంబర్ 4న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, జిల్లా ఎస్పీలకు,కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామన్నారు.తమ న్యాయమైన డిమాండ్లను సెప్టెంబర్ 15 లోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు, నిరాహారదీక్షలు
చేపట్టుతామన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నగరంలో స్వర్ణకార మహా గర్జన నిర్వహించి తమ సత్తా ఏమిటో చూపుతామని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మణా చారి, ఎం.శ్రీనివాసా చారి,ఆర్.భిక్షపతి చారి, పి.శ్రీనివాస్, నాయకులు
కిషన్ రావు, సంతోష్ చారి,పి.నాగరాజు చారి,రమేష్, పోతులూరి చారి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.