ఆలయాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో ఆలయ అభివృద్ధి పై, కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం 5.28 ఎకరాలలో ఉందన్నారు. ప్రధాన దేవాలయం, కమ్యూనిటీ హాల్, రెండు చిన్న దేవాలయాలు, బ్రిడ్జి, పల్లె ప్రకృతి వనం, వేస్టేజ్ షేడ్ లు ఉన్నట్లుఆయన అన్నారు. ప్రస్తుతం కాంపౌండ్ వాల్, అభిషేక మండపం, వేదిక, డార్మిటరిలు, స్నానాల గదులు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పార్క్ ఏర్పాటుచేసి, సుందరీకరణ పనులు చేయాలన్నారు. నేచురల్ షెడ్లు, పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం బెంచీలు, ఐమాస్ లైట్లు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయ అప్రోచ్రోడ్ ను అభివృద్ధి పర్చలన్నారు. పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులను తీర్థాల దేవాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణం శివరాత్రి లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు ఈ సమావేశంలో సిపిఓ శ్రీనివాస్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, దేవాదాయ శాఖ ఇఇ కె. దుర్గాప్రసాద్, ఏఇ బివి. రమణ, స్థపతి పి. గణేషన్, ఈవో హరి చంద్రశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking