‘దళిత బంధు’ ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కారే.

అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ నాయకుల.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 29

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీ ఆర్ ఎస్ సర్కార్, అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంను బధనం చేయాలని ఒకే ఒక ఎజెండాగా పెట్టుకొని దళిత బంధం సాధన సమితి పేరుతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు దానివల్ల మా దళితులకు నష్టమే తప్ప లాభం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిండు అసెంబ్లీలో దళిత బంధు కచ్చితంగా లబ్ధిదారులకు అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. ఒకసారి మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని తెలిపారు. దళిత బంధు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జ్. ప్రణవ్ బాబు, టిపిసిసి నెంబర్. పత్తి కిష్ణారెడ్డి, నాయకత్వంలో రెండో విడత దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్, దొడ్డే నవీన్, శ్రీకాంత్, అశోక్, అనిల్, సురేష్, రమేష్, దిలీప్, సాగర్, సాయికిరణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking