సిద్ధార్థ్ విద్యా సంస్థలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.

 

మెదక్ ప్రాజబలం న్యూస్ :-

సివి రామన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక వెంకట్రావు నగర్ కాలనీలోని సిద్ధార్థ్ మోడల్ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సిద్ధార్థ్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు శ్రీ. కే.శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ.. సివి రామన్ రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భంగా మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. వస్తువుపై పడిన కాంతి పరావర్తనం చెంది, దానివల్లే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన పరిశోధనల ద్వారా సివి రామన్ రుజువు చేశారని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ కే.సంధ్యారాణి మాట్లాడుతూ.. ఆర్యభట్ట, సుశ్రుతుడు, స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని నూతన ప్రయోగాలు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు నమూనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమ నమూనాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచీల ప్రిన్సిపాల్స్ , సైన్సు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking