తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామక పత్రం అందుకున్న గడ్డం ప్రశాంత్ కుమార్.
మెదక్ ప్రాజబలం న్యూస్ :-
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రముఖ మీడియా( ప్రతినిధి) రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, గౌరవ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు ప్రముఖ మీడియా బిసిఎన్ ఛానల్ చైర్మన్ మిద్దెల జితేందర్ పటేల్ ,తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు ప్రముఖ గాయకులు గజ్జేల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు మాలి కరుణాకర్, సీనియర్ జర్నలిస్ట్ పరశురాం, పరమేశ్వర్, ప్రకాష్, సురేష్ , శ్రీనివాస్, చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న గడ్డం ప్రశాంత్ కుమార్. ఎల్బీనగర్ చంపాపేట్ లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా స్థాయి జర్నలిస్టుల, పాత్రికేయుల సమావేశాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగానాయకులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ గాయకులు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గజ్జేల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు మిద్దెల జితేందర్ పటేల్, ఉపాధ్యక్షులు మాలి కర్ణాకర్, పరమేశ్వర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర జిల్లాల స్థాయి కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రశాంత్ కుమార్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న జర్నలిస్టుల సమస్యలపై తనవంతు కృషి చేస్తానన్నారు.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం పాత్రికేయుల ఐక్యత సంక్షేమ భరోసా జర్నలిస్టు జర్నలిస్టులకు వారి కుటుంబం సభ్యులకు ముఖ్యంగా విద్య ఆరోగ్యం అవసరమని దానికి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టులకు సాధనకై నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యత భరోసా సంక్షేమ కోసం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం లక్ష్యం గా పని చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జర్నలిస్టులకు చేసిన సేవలను గుర్తించి పలువురు జర్నలి సంక్షేమ సంఘంకు ఆకర్షితులైతున్నారు. జర్నలిస్టులు, వివిధ రంగాలలో ఉన్న పాత్రికేయులు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరుతున్నారు. నాపై నమ్మకంతో రాష్ట్ర కమిటీ లో సభ్యులుగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల పాత్రికేయులు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.