ఇంటర్ పరీక్షా కేంద్రాలను అస్మికంగా పరిశీలించిన తూప్రాన్ సీఐ కృష్ణ.

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులకు పలు సూచనలు.

మెదక్, 29 ఫిబ్రవరి 2024

గురువారం మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మరియు నలంద జూనియర్ కళాశాల ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని తూప్రాన్ సీఐ కృష్ణ అధికారులతో ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్న దృష్ట్యా ఆయా కళాశాలలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు.నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరు, పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.

పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్లు, కళాశాల కరస్పాండెంట్
డాక్టర్ పివి రమణ , ఇంచార్జ్ పట్లూరి రవీందర్, సిఐ కృష్ణకు వివరించారు.
అనంతరం పరీక్షా కేంద్రంలోని పరీక్ష గదులను పరిశీలించి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో కల్పించిన ఫర్నిచర్‌, త్రాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా తగిన మౌలిక సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నలంద కాలేజ్ కరస్పాండెంట్ డాక్టర్
పివి రమణ, ప్రిన్సిపాల్ నరేష్ నలందా కాలేజు ఇంచార్జ్ పట్లూరి రవీందర్, తూప్రాన్ మండల ఎస్సై శివానందం, ప్లేయింగ్ స్కార్డ్ నరేందర్ , రెవిన్యూ అధికారి నాగ వర్ధన్, లెక్చరర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking