మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ట్రేని ఐఎస్ఎస్, ఐ ఈ ఎస్ అధికారుల బృందం ఐదు రోజులుగా గ్రామంలోనే ఉంటూ ప్రభుత్వ పథకాల తీరు, గ్రామ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణ స్థితిగతులపై అధ్యయనం చేస్తుంది.. విద్య, వైద్య, ఉపాధిపై గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులను నేరుగా పరిశీలించి కూలీలతో మాట్లాడారు.. అలాగే గ్రామంలోని అంగన్వాడి సెంటర్లను, ప్రభుత్వం పాఠశాలలను, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ సెంటర్ ను సందర్శించి వివరాలు సేకరించారు. పాఠశాలలలో విద్యార్థులతో కొద్దిసేపు ఆడి పాడి బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అధికారులు ప్రియాంక అంజాయ్, ప్రజ్ఞ, వికాస్ గుర్జార్, రాఘవేంద్ర పాండే, చమన్ సింగ్, సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి,మహిళలు పాల్గొన్నారు.