కంటి వెలుగు మెడికల్ క్యాంపు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 09 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం కొరకు లక్షెట్టిపేట పురపాలక సంఘ పరిదిలోని వార్డ్ నెం 9 ఉత్కురు లోని ఎం.పి.పి.ఎస్ స్కూల్ నందు కంటి వెలుగు మెడికల్ క్యాంపు ను మున్సిపల్ చైర్మెన్ నల్మాస్ కాంతయ్య ప్రారంబించారు. గురువారం ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడకా కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక కొత్త కొత్త స్కీముల ద్వారా పేద ప్రజల కోసం ఈ కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు దీనిని అద్దారు వినియోగ ఇచ్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమం లో వార్డ్ కౌన్సిలర్ ఒరగంటి శ్రీకాంత్ మునిసిపల్ మేనేజర్ రాజశేఖర్ 9 వ వార్డ్ అధ్యక్షుడు కాసు ధర్మయ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ కాసు సురేష్, నడిమెట్ల రాజన్న,రాందేనీ‌ తిరుపతి, నాయకులు,వైద్య సిబ్బంది, మునిసిపల్ కార్యాలయ సిబ్బంది, మేప్మ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking