ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 09 : మంచిర్యాల జిల్లా లోని లక్షెట్టిపేట లోన ఖైదీలందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.సి సుబ్బారాయుడు అన్నారు. గురువారం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తో సబ్ జైలు లో ఖైదీలకు హెచ్ ఐ వి, టి బి సుఖ వ్యాధులు,హెపటైటిస్ బి,సి కి సంబంధించిన వ్యాధుల రక్త పరీక్షలు నిర్వహించారు.గురువారం ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ….. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. వ్యాధుల పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఫయాజ్ ఖాన్,ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, సబ్ జైలు అధికారి స్వామి,జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సూపర్ వైజర్ వి.అనిల్ కుమార్,ఐసిటిసి కౌన్సిలర్ అంజనేయులు,ల్యాబ్ టెక్నిషయన్లు శ్రీనివాస రెడ్డి,జైలు సిబ్బంది పాల్గొన్నారు.