మెదక్, ఏప్రిల్ 15, 2023 రహాదారులు బాగుంటేనే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు దూరభారం తగ్గి సుఖప్రయాణం చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని ఆ దిశగా త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శనివారం తన ఛాంబర్ లో ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ తో కలిసి అందోల్ నియోజక వర్గంలో రహదారులు, భవనాలు, పంచాయత్ రాజ్ శాఖల ద్వారా వివిధ పధకాల క్రింద చేపట్టిన బి.టి. రెన్యువల్స్ పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ రోడ్లు భవనాలు శాఖ ద్వారా 2021-22, 2022-23 సంవత్సరంలో 32 కిలో మీటర్ల మేర బి.టి. రోడ్డుపునరుద్దరణకు 8 పనులు మంజూరు కాగా కేవలం ఒక పనికి మాత్రమే టెండరు వచ్చినదని, మిగతా వాటికీ కూడా టెండర్లు మరోమారు ఆహ్వానించి వేనని పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పంచాయత్ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారుల నిర్వహణ, వరద నష్ట ఉపశమనం , స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద 28 పనులకు సంబంధించి ఇంతవరకు టెండరు రాని వాటికి మరోమారు టెండర్లు ఆహ్వానించి, వెంటనే పనులు చేపట్టుటకు చొరవ చూపాలని పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఇంచార్జి ఈ ఈ సురేష్, డిప్యూటీ ఈ ఈ వెంకటేశం, పంచాయత్ రాజ్ ఈ ఈ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.