బీసీలను అవమానించిన కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలి

 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై బీసీ సంఘాల నిరసన ప్రదర్శన.

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 02 : పార్లమెంటు వేదికగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని వివిధ బీసీ సంఘాల నాయకులు డిమాండు చేశారు.
మంచిర్యాలలో శుక్రవారం రోజున నిరసన చేపట్టిన వారు కేంద్ర మంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. మొన్న పార్లమెంటు చర్చలలో.. “కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కులగణన చేపట్టాలి!”అని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి.”తమ కులం ఏమిటో తెలియని వాళ్లు కుల గణన కావాలని అడుగుతున్నారు” అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు.కుల గణన అనేది ఈ దేశపు మెజార్టీ వర్గమైన బీసీల న్యాయమైన డిమాండు అని వారు పేర్కొన్నారు. కులగణన చేపట్టాలని అడుగుతున్న వారిని తూలనాడుతూ మాట్లాడడం తగదని తెలిపారు.ఠాకూర్ గారి అగ్రకుల దురహంకారాన్ని బీసీ బిడ్డలు అంగీకరించరని హెచ్చరించారు. మెజార్టీ వర్గాల న్యాయమైన ఆకాంక్షలు తీర్చడం ఎలాగో చర్చించి సలహాలు తీసుకోవాలి తప్ప అడిగిన వారిని నిందించడం సమంజసం కాదని పేర్కొన్నారు.ప్రజలకు మేలు చేసే మంచి పనులు చేయడం చేతకాక,చట్టసభల్లో ప్రస్తావిస్తున్న వారిని నిందించడం తగదని వారు తెలిపారు. బీసీల న్యాయమైన ఆకాంక్షలను సభ దృష్టికి తీసుకొస్తున్న వారిని గౌరవించండం కేంద్ర మంత్రి నేర్చుకోవాలని హితవు పలికారు.బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి సత్వరం చర్యలు తీసుకుంటూ కులగణన చేపట్టి మెజార్టీ వర్గాల న్యాయమైన ఆకాంక్షలు నెరవేర్చాలని వారు డిమాండు చేసారు.ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం,బీసీ సీనియర్ నాయకులు కనుకుంట్ల మల్లయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్,బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి నాయకులు మోతె రామదాసు,గాండ్ల తిలకేశ్వర సంఘం జిల్లా అధ్యక్షులు బుద్ధి చంద్రమౌళి,పద్మశాలి సంఘం నాయకులు చలమల్ల అంజయ్య, బీసీ ఐక్య వేదిక నస్పూర్ మండల అధ్యక్షులు సోమన్న, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి,మొగిళి తిరుపతి,డాక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking