సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీల్లో సమాన అవకాశాలు

 

అమరవీరుల పోరాట ఫలితమే ఏబీసీడీ వర్గీకరణ

ఉత్కూర్ మాదిగ కమిటీ అధ్యక్షుడు అడ్లూరి కాంతారావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 02 : దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూల తీర్పు ఇవ్వడం ద్వారా ఎస్సీల్లో సమాన అవకాశాలు దక్కుతాయని, ఇది మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితమేనని ఉత్కూర్ మాదిగ కమిటీ అధ్యక్షుడు అడ్లూరి కాంతారావు పేర్కొన్నారు. శుక్రవారం ఉత్కూర్ మాదిగ కమిటీ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉత్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,ఒకరికొకరు స్వీట్లు తినిపిచుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ అమలు కావడం చాలా సంతోష దాయకమని, గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిపిన పోరాట పాలితమేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు మడిపల్లి స్వామి,అయిల్ల రాజలింగు, దర్శనాల నవీన్ కుమార్, కళ్లేపల్లి విక్రమ్,దర్శనాల రవి,బిరుదుల ధర్మయ్య, అడ్లూరి దేవేందర్, ఇమ్మన్న,నర్సయ్య,రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking