సీఎస్ఐ చర్చ్ ఫాధర్ డేవిడ్ పాల్
ఘనంగా క్రీస్తు పునరుద్దాన మహోత్సవ జాతర
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : సర్వమానవాళికి శాంతి సందేశాన్ని బోదించిన శాంతి దూత యేసుక్రీస్తు అని సీఎస్ఐ చర్చి ఫాదర్ డేవిడ్ పాల్ పేర్కొన్నారు.దేశంలోనే రెండవ పెద్ద చర్చ్ గా పిలువబడుతున్న మోదెలలో గల సిఎస్ఐ చర్చ్ ఏసు పునరుద్దాన మహోత్సవ జాతరను చర్చ్ ఫాదర్ లు కలిసి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలో సంబరాలు ఆకాశన్నంటెలా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరిన కోరికలు తీర్చి దేవునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ మాట్లాడుతూ…ఏప్రిల్ 25, 26 రెండు రోజులు జాతర కొనసాగుతుందన్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల తో పాటు రాష్ట్రాల నుండి కూడా వస్తారన్నారు. మొక్కుబడి చెల్లించేందుకు ఏ ప్రాంతంలో ఉన్న జాతరకు వస్తారన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు,చర్చి మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
